చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన నేదురుమల్లి !

-

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తాజాగా చంద్రబాబు పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ రోజు నేదురుమల్లి మీడియాతో మాట్లాడుతూ జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారన్నది చంద్రబాబు గుర్తించాలన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్న చంద్రబాబు వైసీపీ పై ఈ రకమైన విమర్శలు చేయడం తగదన్నారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జగన్ అన్న సంక్షేమ పధకాలను ప్రారంభించి ఒక్కో లబ్ధిదారుడికి డైరెక్ట్ గా వారి అకౌంట్ లోకి వెళ్లేలా పారదర్శక పాలనను అందిస్తున్నారు.

- Advertisement -

మా ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేసుకుంటూ పోతోంది. ఈ రోజు మా ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్నో పధకాలను పక్క రాష్ట్రాలు కూడా అనుసరించడం మా గొప్పతనం అంటూ చంద్రబాబు విమర్శలను తిప్పికొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...