నీట్‌ పీజీ పరీక్ష వాయిదా!

-

విద్యార్థుల శ్రేయస్సు కోరుతూ నీట్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ తెలిపారు. రాబోవు రోజుల్లో కరోనా స్థితిగతులను బట్టి త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో నీట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్‌ పరీక్షలు వాయిదా వేయాలని కొద్ది రోజులుగా వినిపిస్తోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలోనే నీట్‌ పీజీ పరీక్షపై గురువారం (ఏప్రిల్‌ 15) కేంద్రం స్పష్టత ఇచ్చింది.

 

ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నీట్‌ పీజీ పరీక్షను ఏప్రిల్‌ 18న పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష తేదీలో ఎటువంటి మార్పు ఉండదని ఇటీవల స్పష్టం చేసింది. కానీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతులు వెల్లువెత్తిన నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నీట్‌ పీజీ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ఈ పరీక్షకు సంబంధించిన అడ్మికార్డులను కూడా ఎన్‌ బీఈ నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ విడుదల చేసింది. విద్యార్థులు తదుపరి పరీక్ష వివరాలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు కూడా త్వరలో అధికారిక వెబ్‌సైట్‌ http/nbe.co.in ద్వారా అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version