బిగ్ బాస్ టీం ను ఆటాడుకుంటున్న నెటిజన్స్..ప్రోమో ఏదిరా అంటూ..?

-

గత రెండు వారాలుగా బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బిగ్ బాస్ ఇంట్లో జరిగే విషయాలను ఇంట్రెస్టింగ్ గా మలచడంలో ప్రోమోల పాత్ర మొదటి ప్రాధాన్యత వహిస్తుంది. ఇక షోలో ఎంత పస లేకపోయినా కూడా ప్రోమోతో హైప్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. ఒకప్పుడు అయితే బిగ్ బాస్ టీం ప్రోమో ఎడిటర్లకు ఆస్కార్లు కూడా ఇవ్వచ్చు అంటూ సెటైర్లు పడుతూ ఉండేది. ఎందుకంటే ప్రోమోలో గోరంత గొడవలు అయినా సరే కొండంత గొడవలు ఉన్నట్లుగా చూపించేవారు.. ఇక అలా బిగ్ బాస్ ప్రోమోలపైన అందరి చూపు పడేది. ఇక ఈమధ్య కొందరైతే కేవలం ప్రోమోలను చూసి వదిలేస్తున్నారు.

ఈ సపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యూట్యూబ్లో కామెంట్లు లైక్లతో సందడి చేస్తూ ఉంటారు. కేవలం ప్రోమో చూసేవారు మాత్రమే లైక్ చేయండి.. కామెంట్ చేయండి అని అంటూ ఉంటారు . ప్రోమో కోసం ఎదురు చూసే వారు కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో మీద చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా బిగ్ బాస్ రోజుకు రెండు ప్రోమోలను విడుదల చేస్తూ ఉంటుంది. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటిన్నట్టుగా .. ఇక వీకెండ్ అయితే ఇంకో ప్రోమో అదనంగా రావాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు ఒక్క ప్రోమో కూడా ఈ రోజు రాలేదు. దీంతో బిగ్ బాస్ టీం పై ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు. ఏరా ఏం చేస్తున్నారు? షో ఉందని మరిచిపోయారా ? తాగి పడుకున్నారా? ప్రోమో ఎక్కడరా? అంటూ దారుణంగా సెటైర్లు వేస్తున్నారు.

అయితే ప్రోమో రాకపోవడానికి గల కారణం ఏమిటనే విషయం తెలియలేదు. కానీ మొత్తానికి ఈ రెండో వారంలో బిగ్ బాస్ నుంచి ఇద్దరు బయటకు వెళ్తున్నారు అని వారు షాని , అభినయ అంటూ రూమర్లు వస్తున్నాయి.. ఎపిసోడ్ విడుదల అయితే తప్ప ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version