నేచురల్ స్టార్ నాని కొత్త లుక్ లో సూపర్ గా ఉన్నాడుగా.!

-

నేచురల్ స్టార్ నాని  హీరోగా నటిస్తున్న దసరా అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగిందనే ప్రచారం వుంది.  మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’  విడుదలైంది. అలాగే ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఇది కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇక హిట్ కోసం నాని మొత్తం  మమ మాస్ లాగా  తయారు అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు. ఇక పోస్టర్ వెనకాల సిల్క్ స్మిత పోస్టర్ పెట్టుకొని మా సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సింబాలిక్ గా చెబుతున్నాడు. సినిమాను ఈ ఏడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నెక్స్ట్ సినిమా కోసం లుక్ మారుస్తున్నాడు.ఇక నాని తన 30వ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌లో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం తన గుబురు గడ్డం ,మీసాలు  తీసివేసి నీట్ గా రెడీ అయ్యాడు.కొత్త లుక్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version