సోలార్ లైట్లతో సరికొత్త వ్యవసాయం.. ధర తక్కువ.. లాభాలు బోలెడు..

-

మన దేశంలో విద్యుత్ వినియోగం పెరగడంతో సోలార్ వినియోగాన్ని పెంచుతున్నారు. అందుకు ప్రభుత్వం సహకారం కూడా అందిస్తుంది.. ఇక విషయానికొస్తే వ్యవసాయం లో కూడా సోలార్ ను ఉపయోగిస్తున్నారు.. మోటారు నడపటానికి మాత్రమే కాదు.. చీడ పీడల నుంచి కూడా పంటను రక్షించడానికి వాడుతున్నారు.. అవును మీరు విన్నది అక్షరాల నిజం..రామచంద్రాపురం గ్రామంలో పలువురు రైతులు మిర్చి సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పంటను కాపాడుకునేందుకు నూతన మార్గాలనూ అన్వేషిస్తున్నారు.

 

 

 

 

ఈ క్రమంలో పురుగుల బెడదతో మిర్చికి ఎక్కువ నష్టం వాటిల్లుతుండగా, వాటి నివారణకు సోలార్‌ లైట్ల ప్రయోగాన్ని అనుసరిస్తున్నారు. ఒక్కో సోలార్‌ లైట్‌ రూ. 3500తో కొనుగోలు చేసి.. ఎకరానికి ఒకటి చొప్పున మిర్చి తోటల్లో ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సూర్యరశ్మితో చార్జింగ్‌ అయ్యే ఈ లైట్లు రాత్రి ఆటోమెటిక్ గా అవి వెలుగుతాయి.. వెలుతురుకు తెల్లదోమ, పచ్చపురుగు, నల్లిపురుగులు వచ్చి లైట్‌ కింది ట్రేలో పడి చనిపోతాయి.. అలా మీకు ఎటువంటి శ్రమ లేకుండా పని అవుతుంది.. ఇలా చేసిన రైతులు చాలావరకు సక్సెస్ అయినట్లు తెలుస్తుంది..

సోలార్‌ లైట్ల ద్వారా పురుగులను చంపడంతో మందుల ఖర్చు ఉండటం లేదు. దీంతో పెట్టుబడి డబ్బులు మిగులుతున్నాయి. అంతేకాకుండా, పురుగుల మందు వల్ల కలిగే అనర్థాలను నివారించినట్లు అవుతున్నది. సహజసిద్ధంగా పెరుగుతున్న తోటల్లో దిగుబడి పెరుగుతున్నది. కొందరు రైతులు ఈ విధానాన్ని చూసి.. తాము సోలార్‌ లైట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది..ఈ విధానం ఒక్క మిర్చి పంటకు మాత్రమే కాదు చాలా పంటలకు ఈ విధానాన్ని అమలు చేసే ప్లాన్ లో ఉన్నారు.. ప్రభుత్వం సోలార్ పై సబ్సిడీ కూడా ఇస్తుంది.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందవచ్చు.. మీకు ఇలాంటి ఆలోచన ఉంటే వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించండి..

Read more RELATED
Recommended to you

Latest news