హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు 17 MMTS సర్వీసులు రద్దు

-

నిర్వ‌హ‌ణ స‌మ‌స్య‌ల వ‌ల్ల ప‌లు ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మొత్తం 17 స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపారు. లింగంప‌ల్లి –హైద‌రాబాద్ మార్గంలో రెండు స‌ర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లో మూడు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో ఐదు సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో ఆరు సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం రూట్లో మూడు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

నిత్యం వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, రోజు వారీ కూలీలు.. ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఐతే పలు కారణాల వల్ల ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దవుతున్నాయి. నిర్వహణ సమస్యల వల్ల మంగళవారం 17 సర్వీసులను రద్దు చేయగా.. ఇవాళ కూడా 17 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. రెగ్యుల‌ర్‌గా ఎంఎంటీఎస్ స‌ర్వీసుల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఎంచుకోవాల‌ని అధికారులు ఆదేశించారు .

లింగంప‌ల్లి –హైద‌రాబాద్ మార్గంలో రెండు స‌ర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో మూడు సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో ఆరు సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం రూట్లో మూడు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది .

రద్దైన ఎంఎంటీఎస్ రైలు వివరాలు:

ఫలక్‌నుమా-రామచంద్రపురం రూట్

రైలు నం. 47177 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)

రైలు నం. 47218 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)

రైలు నం. 47201 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)

హైదరాబాద్-లింగంపల్లి రూట్:

రైలు నెం. 47110 (హైదరాబాద్-లింగంపల్లి)

రైలు నెం. 47111 (హైదరాబాద్-లింగంపల్లి)

రైలు నెం. 47119 (హైదరాబాద్-లింగంపల్లి)

లింగంపల్లి-హైదరాబాద్ రూట్

రైలు నెం. 47135 (లింగంపల్లి-హైదరాబాద్)

రైలు నెం. 47137 (లింగంపల్లి-హైదరాబాద్)

ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్

రైలు నం. 47160 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

రైలు నం. 47156 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

రైలు నం. 47158 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

రైలు నం. 47214 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

రైలు నం. 47216 (ఫలక్‌నుమా-లింగంపల్లి)

 

 

Read more RELATED
Recommended to you

Latest news