షూస్ కోసం సరికొత్త డివైజ్..ధర ఎంత తెలుసా?

-

ఒకప్పుడు రకరకాల చెప్పులకు మార్కెట్ లో మంచి డిమాండ్ వుండేది..ఎందుకంటే మార్కెట్ లో వాటి వాడకం అప్పుడు ఎక్కువగా ఉండేది.. కానీ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా షూ లను వాడుతున్నారు. ఎంత రెడీ అయిన కూడా షూ వేస్తే వచ్చే లుక్ వేరేలా వుంటుంది..పుట్టిన పిల్లాడి దగ్గరి నుంచి పెద్ద ముసలి వాళ్ళు వరకూ వాటిని వాడుతున్నారు..ఇక తమ బ్రాండ్ సేల్ పెంచుకునే క్రమంలో పలు రకాల ఆఫర్లను కూడా అందిస్తున్నాయి కంపెనీలు..

 

అయితే, షూలను నిత్యం వేసుకోవడం వల్ల చెమటకు దుర్గంధం వాసన కూడా వస్తుంది..ఆ వాసన భరించ లేని విధంగా ఉండటం వల్ల కొందరు వేలకు వేలు పోసిన షూ లను నీళ్ల తో కడగటం వల్ల అవి తొందరగా,చిరిగి పోవడమో చూస్తూనే ఉంటాము..ఆ బాధల నుంచి విముక్తి కలిగే న్యూస్..షూలను క్లీన్ చేసే పరికరం ఒకటి మార్కెట్ లోకి వచ్చింది.అదేంటో, దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

ఈ పరికరం చెంతనుంటే, ఎంత సున్నితమైన, ఎంత ఖరీదైన పాదరక్షలనైనా పదిలంగా కాపాడుకోవచ్చు.. బహుళజాతి సంస్థ ‘నెసుగర్’ ఈ పరికరాన్ని రూపొందించింది. ఇది షూ డ్రైయర్-డీయాడరైజర్. చెమ్మదేరిన లేదా తడిసిపోయిన పాదరక్షలను ఇది నిమిషాల్లో పొడిగా తయారుచేస్తుంది. ఇందులో రెండు రకాల ఉష్ణోగ్రతలను అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది. షూ రకాలను బట్టి వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు.అలాగే, ఇందులోని ఓజోన్ స్టెరిలైజేషన్ మోడ్ను ఆన్ చేసుకున్నట్లయితే, షూస్లోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ఫలితంగా వాటి ద్వారా వ్యాపించే దుర్గంధం కూడా నశిస్తుంది. ఈ పరికరాన్ని చక్కగా మడిచిపెట్టి భద్రపరచుకునే సౌలభ్యం ఉండటం మరో విశేషం..ప్రస్తుతం ఈ పరికరం కు మంచి డిమాండ్ ఏర్పడింది.దీని ధర రూ.1000 ఉండోచ్చనని అంచనా..దీని గురించి పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version