లెక్చరర్‌గా పవన్ కల్యాణ్..‘భవదీయుడు భగత్ సింగ్’లో సామాజిక సందేశం!

-

జనసేనాని పవన్ కల్యాణ్..‘వకీల్ సాబ్’గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దూసుకుపోతున్నరు. వరుస సినిమాలు చేస్తూనే మరో వైపున రాజకీయం చేస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ అశేష అభిమానులు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘‘భవదీయుడు భగత్ సింగ్’’ అప్ డేట్ కోసం ఎదురు చూస్తుండగా, తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Bhavadeeyudu-Bhagat-Singh
Bhavadeeyudu-Bhagat-Singh

పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కాగా, ఆ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే హరీశ్ శంకర్‘ భవదీయుడు భగత్ సింగ్’ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ లెక్చరర్ రోల్ ప్లే చేస్తారని తెలుస్తోంది. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్ టైన్మెంట్ అనే క్యాప్షన్ ను సినిమా టైటిల్ కింద వేయడంలో హరీశ్ శంకర్.. జాగ్రత్త వహించినట్లు టాక్. ఎంటర్ టైన్మెంట్ ను మించి సొసైటీకి చక్కటి సందేశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

ఈ ఏడాది ఆగస్టులో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్..తథా వ్యవహారమ్’ చిత్రంతో పాటు సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సిత్తం’ రీమేక్ చేయబోతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news