వాహనాదరులకు కేంద్రం షాక్‌.. మరోసారి పెరిగి సీఎన్జీ ధరలు..

-

మరోసారి కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు షాక్‌ ఇచ్చింది. వరుసగా పెట్రోల్‌, డిజీల్‌ పెరుగుతుండడంతో అందరూ సీఎన్జీ వాహనాలపై దృష్టి సారించారు. అయితే ఇప్పుడు మరోసారి సీఎన్జీ ధరలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం గృహావసరాలకు వినియోగించే, కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.

Compressed Natural Gas or CNG: All you need to know about eco-friendly  alternative to natural

తాజాగా సీఎన్జీ వంతు వచ్చింది. వారం రోజులు గడవకముందే మరోసారి అధికమయ్యాయి. గత వారం రూ.2 వడ్డించగా, మళ్లీ మరో రూ.2 భారంమోపారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.75.61కి చేరింది. ఇక నోయిడా, గ్రేటర్‌ నోయిడా, ఘజియాబాద్‌లో రూ.78.17, ముజఫర్‌నగర్‌, మీరట్‌, షామ్లీ రూ.82.84, గురుగ్రామ్‌ రూ.83.94, రెవారి రూ.86.07, కర్నాల్‌, కైతాల్‌ రూ.84.27, కాన్పూర్‌, హమిర్‌పూర్‌, ఫతేహ్‌పూర్‌ రూ.87.40, అజ్మీర్‌, పాలి, రాజ్‌సమండ్‌ రూ.85.88కు చేరాయి. దీంతో వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ బైక్‌లు పేలుతున్న నేపథ్యంలో వాటిని కొనేందుకు జనాలు కొంచెం ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news