హాయిగా F3ని చూసేయొచ్చు..ఆ సీన్స్‌కు నో చాన్స్

-

ఇటీవల కాలంలో ఫిల్మ్ మేకర్స్..కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సినిమా చూసేలా సినిమాను తెరకెక్కించడం లేదు. అయితే, మొత్తానికి మొత్తం అలా లేదని అనలేం. కానీ, వాటి సంఖ్య చాలా తక్కువగా ఉందని అయితే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన F3 ఫిల్మ్ చేశారు. ఈ మూవీలో చక్కటి వినోదం ఉందని ప్రమోషన్స్ లో చెప్తున్నారు.

ఈ పిక్చర్ లో మరో విశేషం ఉందండోయ్..ఈ చిత్రాన్ని హాయిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేయొచ్చు. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ పిక్చర్ కు ‘‘క్లీన్ U సర్టిఫికెట్’’ ఇచ్చారు. దాని అర్థం ఇందులో ఎక్కడా కూడా ధూమపానం, మద్యపానంకు సంబంధించిన సన్నివేశాలు లేవు. ఇక మూవీ స్టార్టింగ్ టైంలోనూ ‘ముఖేష్ యాడ్..బాధ ఉండబోదు’ అన్న మాట.

సినిమా రన్ టైమ్ కూడా..పర్ఫక్ట్ గా వచ్చిందట. 2 గంట‌ల 20 నిమిషాలలో సినిమా కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఫన్ తో పాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ పైన డైరెక్టర్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. కుటుంబంతో సహా వెళ్లి ప్రతీ ఒక్కరు ఈ సినిమా చూసేలా ప్లాన్ చేశారట మేకర్స్. ఈ నెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version