NTR 30 హీరోయిన్ ఫిక్స్..తారక్ సరసన సాయిపల్లవి?

-

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ లైనప్ మూవీస్ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుండటం విశేషం. ఈ నెల 20న తారక్ బర్త్ డే సందర్భంగా తారక్ నటించబోయే NTR30 ప్రాజెక్టు డీటెయిల్స్ వస్తాయని సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆలియా భట్ ను ఫిక్స్ చేశారని గతంలో వార్తలొచ్చాయి. కాగా, ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం..ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ విషయం అఫీషియల్ అయితే కనుక పిక్చర్ లో హీరో, హీరోయిన్స్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని అభిమానులు అంటున్నారు.

మంచి డ్యాన్సర్ అయిన సాయిపల్లవి..తారక్ తో ఈ సినిమాలో వేయబోయే స్టెప్పులు చూడటానికి థియేటర్ లో రెండు కళ్లు చాలవని సినీ లవర్స్ అంటున్నారు.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ చిత్రం పూర్తి కాగానే ‘కేజీఎఫ్, సలార్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో 31వ చిత్రం చేయనున్నారు. ఈ పిక్చర్ తర్వాత ‘ఉప్పెన ’ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తారక్ తన 32 వ పిక్చర్ చేస్తారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version