Project K అప్‌డేట్..ప్రభాస్ ఫిల్మ్‌లో మరో బాలీవుడ్ హీరోయిన్‌

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న Project K అప్ డేట్ కోసం ఆయన అశేష అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ లో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ పిక్చర్ లో ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతార్ లో కనిపించనున్నారు.

తాజాగా ఈ పిక్చర్ కు సంబంధించిన మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ యాక్ట్ చేస్తు్న్నట్లు తెలిపారు. ఆమెకు వెల్ కమ్ చెప్తూ గిఫ్ట్ కూడా పంపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రాజెక్ట్ కెలో కీ రోల్ ప్లే చేయబోతున్నది. ప్రాజెక్ట్ కె నుంచి తనకు ఆహ్వానంతో పాటు గిఫ్ట్ లభించడం పట్ల దిశా పటాని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన సంతోషాన్ని తెలిపింది.

దిశాపటానీ సినీ కెరీర్ తెలుగు సినిమాతోనే స్టార్ట్ అవడం విశేషం. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్’ పిక్చర్ తో దిశా పటానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version