Ram Charan: మరో RC15 లీక్..పాటలపై మ్యూజిక్ డైెరెక్టర్ థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫిల్మ్ RC 15 గురించి వరుస లీకులు వస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్, లుక్స్, ఫొటోలు, స్టోరి గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో బోలెడంత డిస్కషన్ జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేస్తున్న మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.థమన్ చిత్ర అప్ డేట్స్ ఇచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

తన మెంటార్ అయిన శంకర్ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం తనకు ఆనందం ఉందని చెప్పుకొచ్చాడు థమన్. తాను 2000 సంవత్సరంలో ‘బాయ్స్’ సినిమాలో నటించానని, దాదాపు 22 ఏళ్ల తర్వాత తన మెంటార్ శంకర్..తన కోసం వచ్చాడని ఆనందం వ్యక్తం చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇక పోతే శంకర్ సినిమాల్లో సాంగ్స్ చాలా గ్రాండ్ గా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

RC 15 ఫిల్మ్ లో టోటల్ ఆరు పాటలున్నాయని తెలిపిన థమన్..ఆరు కూడా టాప్ సింగర్స్ చేత పాడించిన్నట్లు తెలిపారు. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ కూడా అయిపోయినట్లు తెలిపారు థమన్. మిగిలిన సాంగ్స్ చిత్రీకరణకు ఇప్పుడు షెడ్యూల్ వేసుకుంటున్నారని వివరించాడు.

డైరెక్టర్ శంకర్ సాంగ్స్ మేకింగ్ పైన ఫుల్ కాన్సంట్రేట్ చేస్తారని చెప్పారు. కొవిడ్ టైంలో చిత్రీకరణ సాధ్యపడలేదని, ఎందుకంటే ఆయన పాటలు చాలా గ్రాండియర్ గా ఉంటాయని, ఈ క్రమంలోనే సాంగ్స్ ను డైరెక్టర్ శంకర్ ఇప్పుడు హ్యాపీగా చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది చివరికల్లా పిక్చర్ షూటింగ్ కంప్లీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news