కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలోనే.. కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మె సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ను కర్ణాటక రాష్ట్రంలో.. ఎత్తి వేయాలని.. నిర్ణయం తీసుకుంది బొమ్మె సర్కార్. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జనవరి 31 వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రంలో.. నైట్ కర్ఫ్యూ ఉండదని.. బెంగళూరులోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి ఆఫ్ లైన్ క్లాసులను ప్రారంభించడానికి అనుమతించామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బెంగుళూరులోని అన్ని పాఠశాలల్లో కరోనా మహమ్మారి నియమ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. నైట్ కర్ఫ్యూ ను ఎత్తి వేసినప్పటికీని.. ప్రజలు అందరూ మాస్క్‌లు, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా నియమాలు పాటించని వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. కాగా.. గత 15 రోజుల కిందటే కర్ణాటక రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం విధించిన సంగతి తెలిసిందే.