నీర్మల్ జిల్లా రూరల్ మండలంలోని లంగ్డాపూర్ అనే గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామం లో ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో ఒక రావి చెట్టు ఉన్నది. ఆ రావి చెట్టు నుండి నీళ్ళు ధారలలాగా వస్తుండడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దాంతో చుట్టూప్రక్కల గ్రామ ప్రజలు ఆ వింతను చూడడానికి పెద్ద ఎత్తున జనం రావడంతో ఆ ఆలయం ఆవరణ అంతా జన సందోహంగా మారింది. మహిళలు అందరూ రావి చెట్టు నుండి వచ్చే నీళ్ల ధారాలను చూసి ఇది భగవంతుని లీలా అంటూ… రావి చెట్టుకు పసుపు, కుంకుమ, పూలతో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
రావి చెట్టు నుండి వచ్చే జలాన్ని తీర్థంలా సేవిస్తున్నారు. తీర్థాన్ని సేవిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనీ ప్రచారం జరగటంతో భక్తులు తీర్థాన్ని సేవించేందుకు అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు. రావి చెట్టు చుట్టూ ప్రత్యేకమైన ప్రదక్షిణలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కొందరు శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత రోజు నా జరగడంతో ఇదంతా రాముని లీలేనని ప్రజలు రావి చెట్టుకు పూజలు చేస్తున్నారు.