IT returns: ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునే వారికి కేంద్రం శుభవార్త

-

ఐటీ రిటర్నుల దాఖలు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్న్‌ ల దాఖలులో మరో వెసులుబాటు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆదాయపన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకునే వెసులు బాటు అందించారు. అంటే రిటర్న్‌ లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.

అదే విధంగా కోటి కుటుంబాలకు ఉత్వల పథకం విస్తరించనున్నట్లు ప్రకటన చేశారు. సహకారం సంఘాలపై సర్‌ చార్జీని తగ్గించనున్నారు. ప్రత్యామ్నాయ పన్ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేశారు.

అలాగే… ఈ ఏడాది నుంచే దేశంలో 5 జీ టెక్నాలజినీ తీసుకువస్తామని వెల్లడించారు. 2022-23 లో డిజిటల్ చిప్ లతో కూడిన  ఈ- పాస్ పోర్టుల జారీకి కొత్త టెక్నాలజీని జారీ చేస్తామని చెప్పారు. 1.2 లక్షల పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్, ఏటీఏం సేవలను ప్రారంభిస్తామని వెల్లడించారు. దేశంలో 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news