‘నిత్యా మేనన్‌ ప్రెగ్నెంట్..?’.. షాక్‌ లో నెటిజన్లు

-

‘నిత్యా మేనన్‌ ప్రెగ్నెంటా? ఏంటీ.. పెళ్లికాకుండానే గర్భవతి అయిందా?’. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ విషయంపైనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. పాజిటివ్‌ రిజల్ట్‌ కనిపిస్తున్న ప్రెగ్నెన్సీ కిట్‌ను నిత్య తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘అద్భుతం మొదలైంది’ అని వ్యాఖ్యానిస్తూ ప్రెగ్నెంట్‌, లవ్‌ ఎమోజీలను జత చేశారు. అంతకుమించి మరే వివరాలను బయటపెట్టకపోవడంతో అభిమానులు, నెటిజన్లు షాక్‌ అయ్యారు. ‘నిత్యా మేనన్‌కు పెళ్లి ఎప్పుడైంది?’, ‘కంగ్రాట్స్‌’, ‘మీ వివాహం గురించి మాకెందుకు చెప్పలేదు?’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

అసలు విషయం ఏంటంటే.. నిత్య తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆ ఫొటోను పంచుకున్నారు. మలయాళీ నటి పార్వతితో కలిసి నిత్యా మేనన్‌ నటిస్తున్న చిత్రం ‘వండర్‌ విమెన్‌’. దీన్ని ప్రమోట్‌ చేసేందుకే నిత్యతోపాటు పార్వతి ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారు. పార్వతి అభిమానులూ అలానే షాక్‌కు గురయ్యారు. ఈ మలయాళీ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

https://www.instagram.com/nithyamenen/

Read more RELATED
Recommended to you

Latest news