కారులో కమ్యూనిస్టులకు నో ప్లేస్..దెబ్బపడుతుందా!

-

మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి బీజేపీకి చెక్ పెట్టాలని అధికార టీఆర్ఎస్ గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. దుబ్బాక, హుజూరాబాద్ మాదిరిగా మునుగోడులో బీజేపీ గెలిస్తే..ఇంకా బీజేపీని ఆపడం కష్టమైపోతుంది..వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఊపు వస్తుంది. కాబట్టి ఇప్పుడే బీజేపీకి చెక్ పెట్టేయాలని టీఆర్ఎస్ చూస్తుంది. అందుకే మునుగోడులో గెలవడానికి తమ శక్తులని మొత్తం ప్రదర్శిస్తుంది.

ఇప్పటికే టీఆర్ఎస్‌లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు..ఛోటా-బడా నేతలు మొత్తం మునుగోడులో మకాం వేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడానికి పనిచేస్తున్నారు. గెలవడానికి అధికార బలాన్ని మొత్తం ఉపయోగిస్తుంది. అయితే మునుగోడులో ఖచ్చితంగా గెలవాలన్న నేపథ్యంలో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం పార్టీలతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిస్టులకు బలం ఎక్కువగానే ఉంది. సి‌పి‌ఐ పార్టీకి దాదాపు 25 వేల ఓట్ల పైనే బలం ఉంది..అటు సి‌పి‌ఎంకు కూడా పది వేల ఓట్ల వరకు బలం ఉంది.

దీంతో వారి మద్ధతు ఉంటే ఈజీగా గెలిచేయొచ్చు అని చెప్పి..కేసీఆర్, కమ్యూనిస్టులతో కలిశారు. అయితే కమ్యూనిస్టుల మద్ధతు అనేది టీఆర్ఎస్‌కు బెనిఫిట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడొక చిక్కు వచ్చి పడింది. మునుగోడులో కమ్యూనిస్టుల ఓట్లు ఎంతవరకు టీఆర్ఎస్‌కు పడతాయంటే చెప్పలేని పరిస్తితి ఉంది.

ఎందుకంటే కమ్యూనిస్టుల ఓట్లని ఆకర్షించడానికి..క్షేత్ర స్థాయిలో కమ్యూనిస్టు నేతలకు టీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వడం లేదు. మునుగోడులో ప్రతి గ్రామానికి ఓ ఇంచార్జ్‌ని పెట్టిన టీఆర్ఎస్..కమ్యూనిస్టు ప్రభావం ఉన్న గ్రామాల్లో కమ్యూనిస్టు నాయకులకు బాధ్యతలు అప్పగించలేదు. ఏదో పై స్థాయిలో నేతలు ఉన్నారు గాని..క్షేత్ర స్థాయిలో కమ్యూనిస్టులకు టీఆర్ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో పలు గ్రామాల్లో కమ్యూనిస్టు నేతలు టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఆ అసంతృప్తి అలాగే ఎన్నిక సమయం వరకు కొనసాగితే టీఆర్ఎస్‌కు ఇబ్బంది అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news