దిగ్విజయ్ సింగ్, జై రాం రమేష్ లతో భేటి అయ్యారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని.. కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవడం ద్వారా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని అన్నారు. రాహుల్ గాంధీని కలిసాను.. ఇక్కడున్న జాతీయ నేతలతో తెలంగాణ రాజకీయాలపై మాట్లాడానని తెలిపారు.
దేశంలో లౌకిక వాద పౌరులంతా కాంగ్రెస్ వైపు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ వైపు వస్తున్న ఆపడానికి కొన్ని శక్తులు పుట్టుకొస్తున్నాయన్నారు. కెసిఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే అయ్యుండొచ్చని అన్నారు. కెసిఆర్ తో పొత్తు అనేది ఊహాజనిత అంశమన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. మునుగోడులో సైంటిఫిక్ గా ఆలోచించే స్రవంతికి టికెట్ ఇచ్చామన్నారు. ఈ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవబోతుందని అన్నారు.