విజయోత్సవాలు కాదు.. వంచన ఉత్సవాలు : బండి సంజయ్

-

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేది విజయోత్సవాలు కాదని, వంచన ఉత్సవాలు అని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కష్టాలు పడుతున్నారని ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లాలోని కొత్తగట్టు వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.ఈ సందర్భగా బండి మాట్లాడుతూ.. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఫైర్ అయ్యారు.

రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారన్నారు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా ఇచ్చామని అబద్ధాలు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. రాష్ట్రంలో చాలా మంది రైతులకు ఇంకా పూర్తిగా రుణమాఫీ కాలేదని గుర్తుచేశారు.సీఎం మాత్రం మహారాష్ట్రకు వెళ్లి రుణమాఫీ మొత్తం చేశామని డబ్బా కొడుతున్నారన్నారు. ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని డిప్యూటీ సీఎం చెబుతున్నారన్నారు. పత్తి,వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులను కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.ఈ మొహం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తారని.. వంచన ఉత్సవాలు చేయాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version