నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1600కు పైగా ఉద్యోగాలు.. వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నార్త్‌ సెంట్రల్‌ రైల్వే పలు ఖాళీలని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 1664 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభమైంది.

Indian Railways

సెప్టెంబర్‌ 1 వరకు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 10 వ తరగతి, 8 వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో స్పష్టంగా చూడొచ్చు. వయస్సు విషయం లోకి వస్తే…. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌ క్లాస్‌, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

పోస్టుల వివరాలు:

ప్రయాగ్‌రాజ్‌ మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌ – 364
ప్రయాగ్‌రాజ్‌ ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌ – 339
ఝాన్సీ డివిజన్‌ – 480
వర్క్‌షాప్‌ ఝాన్సీ – 185
ఆగ్రా డివిజన్‌ – 296

వెబ్‌సైట్‌:https://www.rrcpryj.org/

 

Read more RELATED
Recommended to you

Exit mobile version