మారిన వాయిస్‌ సోషల్‌ మీడియా క్లబ్‌హౌస్‌ స్టైల్‌!

-

క్లబ్‌హౌస్‌ ( Club House ) పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే! ఇది ఓ వాయిస్‌ సోషల్‌ మీడియా. ఇప్పటికే క్లబ్‌హౌజ్‌కు చాలా మంది వినియోగదారులు పెరిగిపోయారు. గతంలో ఉన్న ఇన్విటేషన్‌ స్టైల్‌ను సంస్థ పక్కనపెట్టింది. అంటే ఇదివరకు క్లబ్‌ హౌస్‌లో ఖాతా తెరవాలంటే… ముందుగా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకొని కావాల్సిన వివరాలు ఇచ్చి… వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండాలి. ఆ తర్వాత మీ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఉన్నవారికి మీ ఇన్విటేషన్‌ రిక్వెస్ట్‌ వెళ్తుంది.

క్లబ్‌హౌస్‌ | Club House

అప్పుడు ఎవరైనా మిమ్మల్ని నామినేట్‌ చేస్తే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఈ క్రమంలో మిమ్మల్ని నామినేట్‌ చేయమని ఎవరికీ సందేశాలు, రిమైండర్లు పంపే ఆప్షన్‌ ఉండదు. దీంతో ఎవరో ఒకరు నామినేట్‌ చేసేంతవరకు మీరు వేయిట్‌ చేయాల్సిందే! ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌ సిస్టమ్‌ను పూర్తిగా తొలగించేసింది. అంటే ఇప్పుడు మీరు మీ వివరాలు ఇచ్చిన వెంటనే మీకో అకౌంట్‌ క్రియేట్‌ అయిపోతుంది. ఆ తర్వాత ఎంచక్కా రకరకాల రూమ్స్‌లో వెళ్లి మాట్లాడొచ్చు, వినొచ్చు. కానీ, దీనికి ఆ రూమ్‌ హోస్ట్‌ మీకు పర్మిషన్‌ ఇవ్వాలి. దాని కోసం మీరు ఆ రూమ్‌లో ఎంటర్‌ అయ్యి ‘హ్యాండ్‌రైజ్‌’ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. ప్రస్తుతం బీటా యూజర్లకు కొంతమందికి అందుబాటులోకి వచ్చింది. త్వరలో అందరూ ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు.

ప్రస్తుతం క్లబ్‌హౌస్‌కు 10 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ క్రమంలోనే సంస్థ ఉద్యోగులు 8 – 58కి పెరిగారు. మరోవైపు క్లబ్‌హౌస్‌ డైరెక్ట్‌ మెసేజ్‌ ఫీచర్‌ ‘బ్యాక్‌ ఛానల్‌’ను ఇటీవల ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు బ్యాక్‌ ఛానల్‌ద్వారా 90 మిలియన్ల మెసేజ్‌లు బట్వాడా అయ్యాయయట. క్లబ్‌హౌస్‌ ఈ మార్పులు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అనేది చెప్పలేదు కానీ, ట్విటర్‌ స్పేసెస్‌ నుంచి ఎదురవుతున్న పోటీయే కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక త్వరలో ఎంచక్కా అందురూ ఏమాత్రం వెయింటిగ్‌ లిస్ట్‌లో ఉండకుండానే క్లబ్‌హౌస్‌లోకి ప్రవేశించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version