ఓమిక్రాన్ ఎఫెక్ట్… పంజాబ్ రాష్ట్రం కీలక నిర్ణయం..

-

దేశంలో ఓమిక్రాన్ కేసులు క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశంలో ఇప్పటికే 600 పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలోని 21 రాష్ట్రాలకు ఓమిక్రాన్ విస్తరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, పండగల వేళ కర్ఫ్యూ విధించాలని రాష్ట్రాలకు సూచించింది.

ఇదిలా ఉంటే క్రమంగా ఒక్కో రాష్ట్రం ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధించాయి. న్యూ ఇయర్ వేడుకను నిషేధించాయి. తాజాగా పంజాబ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకోని వారిని పబ్లిక్ ప్లేసుల్లోకి రాకుండా నిషేధం విధించింది. మంగళ వారం నుంచి జనవరి 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని పంజాబ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే.. ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, గుజరాత్, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలను విధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news