ప్రపంచ దేశాల్లో అలజడి…12 దేశాలకు పాకిన ఓమిక్రాన్..

-

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పేరు చెబితే ప్రపంచ దేశాాలు వణుకుతున్నాయి. దీని ధాటికి పలు దేశాలు తమ దేశ సరిహద్దుల్ని కూడా మూసేస్తున్నాయి. పలు దేశాలు ఆంక్షల ఛట్రంలోకి వెళుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ నెమ్మదిగా ప్రపంచ దేశాలకు పాకడం కలవరపెడుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో 12 దేశాలకు ఓమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్,హాంగ్ కాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయిల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఓమిక్రాన్ ప్రభావంతో ప్రపంచ దేశాలు తమ దేశానికి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేయడంతో పాటు..క్వారంటైన్ నిబంధనలను విధిస్తున్నాయి.corona-virus

ఇదిలా ఉంటే ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత అధికంగా ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి మిగతా దేశాలు. మనదేశం కూడా ఓమిక్రాన్ వేరియంట్ తీవ్రత నేపథ్యంలో అప్రమత్తం అయింది. విదేశాల నుంచి ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనుంది. దీనిపైఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news