శ్రీలంకలో ఉద్రికత.. మరోసారి ఎమర్జెన్సీ..

-

శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు ఆర్థిక పరిస్థితి క్షీణీస్తోంది. ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇందుకు కారణమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మరోమారు గత అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించారు.
మరోవైపు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు ప్రకటించారు విద్యార్థులు. అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తేల్చిచెప్పారు.

అంతేకాదు, ఈ నెల 17న పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం కానుండగా, అదే రోజు పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థులు. ఆ లోపే అధ్యక్షుడు రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేయడమే కాకుండా.. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా వేలాదిమంది విద్యార్థులు కొలంబోలో పార్లమెంటుకు వెళ్లే ప్రధాన రహదారులను 24 గంటలపాటు దిగ్బంధించారు. ఇక, నిన్న ప్రధాని మహిందకు చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు, ప్రజలు మాత్రమే ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తూ వస్తుండగా, తాజాగా నిన్న జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గ సహచరులు కొందరు ఆయన రాజీనామాను డిమాండ్ చేశారు. అయితే.. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడం నెల రోజుల్లో ఇది రెండోసారి.

Read more RELATED
Recommended to you

Latest news