Breaking: మరో పరువు హత్య.. కూతురినే హతమార్చిన తండ్రి..

-

నేటి సమాజంలో పరువుకు ఇచ్చిన విలువను, ప్రాణానికి ఇవ్వలేకపోతున్నారు. కన్న కూతురు వేరే కులం వాడిని చేసుకుంటే.. తట్టుకోలేక కూతురినే కడతేర్చాడు ఓ దుర్మార్గపు తండ్రి. నాన్న నన్ను చంపకండి ప్లీజ్ అంటూ ఆ కూతురు వేడుకున్నా.. పెడచెవిన పెట్టి పరువు హత్యకు పాల్పడ్డాడు.. తాజాగా ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని దర్భంగా జిల్లా రతన్‌పుర గ్రామంలో నెల రోజుల క్రితం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఆడియో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వైరల్​ అయిన ఆడియో’నన్ను వదిలేయండి నాన్న’..: తండ్రి కుమార్తెను హత్య చేస్తున్న సమయంలో ఆమె బాయ్​ఫ్రెండ్​ రికార్డ్​ చేసిన ఓ ఆడియో ప్రస్తుతం వైరలైంది. ‘నాన్న నన్ను చంపకండి ప్లీజ్​.. నేను మీ కూతురిని, నన్ను వదిలేయండి’ అని 20 ఏళ్ల అఫ్రీన్​ తండ్రి ఉస్మాన్​ను వేడుకోవడం అందులో రికార్డ్​ అయింది.

Honour killing

ఏప్రిల్​ 15న అఫ్రీన్​ను హత్య చేసిన ఉస్మాన్​.. మృతదేహాన్ని చెరువులో పడేసి.. కుమార్తె ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందినట్లు నమ్మబలికాడు. మరుసటి రోజు మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు అఫ్రీన్​ నీటమునగడం వల్లే మృతిచెందిందని భావించి ఎలాంటి కేసు నమోదు చేయలేదు. ‘అఫ్రీన్​ హత్య విషయం బయట ఎక్కడైనా తెలిసిందంటే ఆమెకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది’ అంటూ కుటుంబసభ్యులను ఉస్మాన్ బెదిరించాడు. దీంతో అతని భార్య షబానా ఖాతునా, ముగ్గురు పిల్లలు.. నెల రోజుల పాటు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకుండా గుట్టుగా ఉంచారు. అయితే.. ఉస్మాన్​ బెదిరింపులకు భయపడి రక్షణ కోసం వాళ్లు ఈ నెల 21 పోలీసులను ఆశ్రయించడం వల్ల అసలు విషయం బయటపడింది. దీనిపై స్పందించిన పోలీసులు.. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని.. వైరల్‌ అయిన ఆడియోకు హత్య సంబంధం ఉందా లేదా అనే కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news