లాంచ్ అయిన Oppo A77s స్మార్ట్‌ ఫోన్.. ఫీచర్స్‌ ఇవే..!!

-

ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. అదే ఒప్పో ఏ77ఎస్ స్మార్ట్ ఫోన్. దీని కాస్ట్‌ కూడా రూ.20వేల లోపే ఉంది. ఇంకా ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఇది ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ..ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను అందించారు. ఇంకా ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఒప్పో ఏ77ఎస్ ధర..

ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది.
ఆరెంజ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు.

ఒప్పో ఏ77ఎస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఒప్పోకు సెల్ఫీ ఎక్స్‌పర్టన్‌ అని మంచి పేరు ఉంది.. ఈ ఫోన్‌ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుందని అంచనా..

Read more RELATED
Recommended to you

Latest news