అంతర్జాతీయంగా పరువు పోతున్నా సరే పాకిస్తాన్ వైఖరి మాత్రం మారడం లేదు. సరిహద్దుల్లో వరుసగా కాల్పులు జరుపుతూనే ఉంది పాకిస్తాన్. భారత్ లక్ష్యంగా గత నెల రోజుల నుంచి ఎక్కడో ఒక చోట కాల్పులు జరుపుతూనే ఉంది. తాజాగా సరిహద్దుల్లో మరోసారి కాల్పుల ఉల్లంఘనకు దిగింది పాకిస్తాన్. కుప్వారాలోని తంగ్ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఈ రోజు ఉదయం కాల్పుల విరమణ ఉల్లంఘనను ప్రారంభించిందని ఆర్మీ వర్గాలు చెప్పాయి.
పాకిస్తాన్ ఆర్మీ… పౌరులు ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది అని ఆర్మీ పేర్కొంది. ఈ కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి ఆరోగ్యం విషమంగా ఉంది. ఈ కాల్పుల్లో పలువురు ఆర్మీ జవాన్ లకు కూడా గాయాలు అయ్యాయి. దీనిని భారత ఆర్మీ సమర్ధవంతంగా తిప్పి కొడుతుంది. పాకిస్తాన్ జవాన్ లు కూడా పలువురు గాయపడినట్టు తెలుస్తుంది.