ఆయిల్ సంక్షోభం లో పాకిస్థాన్

-

 

 

మన దాయాది దేశం పాకిస్థాన్ కు మనతో లాడాయి పెట్టుకోవడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలదు కానీ తన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రం ఏమాత్రం పట్టదు. అందుకు తగ్గట్టే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి చాలా రోజులు అయ్యింది.

” మూలిగే నక్క మీద తాటికాయ పడింది” అన్న చందంగా ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న పాకిస్థాన్ కు ప్రస్తుతం మరో షాక్ తగిలింది. ఈ సారి ఆ షాక్ ఆయిల్ రూపంలో తగలడం విశేషం.

ప్రస్తుతం పాకిస్థాన్ దేశం మొత్తం మీద ఉన్న ఆయిల్ నిలువలు కేవలం 5 రోజులకు మాత్రమే సరిపోతాయి అంట. ఆ తర్వాత దేశం తీవ్రమైన ఆయిల్ సంక్షోభంలో చిక్కుకుపోతుందని అక్కడి జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.

అసలు ఇంత పెద్ద ఆయిల్ సంక్షోభానికి మూల కారణం ప్రస్తుతం జరుగుతున్న రష్యా – ఉక్రెయిన్ ల యుద్ధమేనట. అసలు పాకిస్థాన్ లో ఆయిల్ సంక్షోభానికి యుద్ధానికి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా అయితే చదవండి.

 

యుద్ధం జరగ ముందు అంతర్జాతీయ మార్కెట్ లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 94 డాలర్ల కాగా ప్రస్తుతం యుద్ధం కారణంగా 112 రూపాయలు చేరడంతో అంత ధర పెట్టి కొనలేని స్థితిలో ఉన్న పాక్ యుద్ధం ఎప్పుడూ ముగుస్తుందా అని ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఈ ఎదురు చూపులే తమ కొంప ముంచాయి అని అక్కడి మేధావులు పేర్కొంటున్నారు.

 

 

పాకిస్థాన్ ప్రభుత్వ ఆయిల్ కంపెనీ తన వద్ద లెక్కల ప్రకారం ఆ దేశంలో ఇంక కేవలం 5 రోజులు సరిపడే ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇవి గాని అయిపోతే పాకిస్థాన్ లో మరో సంక్షోభం లో కురుపోబోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితిని చూసి అందరూ జాలీ చూపిస్తున్నారు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version