కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వమన్నా, తెలంగాణ రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చదని, అందుకే ఇక్కడి రైతులకు ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని పేర్కొన్నారు. తెలంగాణ రైతులను కేంద్రం పట్టించుకోపోయినప్పటికీ.. సీఎం కేసీఆర్ అండగా నిలిచారన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం ప్రకటించారని తెలిపారన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి. రైతులకు అండగా ఉంటూ సాయం చేస్తున్న కేసీఆర్‌పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.
కష్టాల్లో ఉన్నటువంటి రైతులతో ప్రతిపక్షాలు నీచ రాజకీయం చేయడం దురదృష్టకరమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గొప్పగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు.. కేంద్రం నుంచి రైతులకు సాయం ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు. రూపాయి సాయం చేసే తెలివి లేకున్నా… అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వరదలపై ఎన్నిసార్లు నివేదికలు పంపినా… కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. అందుకే ఈసారి సీఎం కేసీఆర్.. కేంద్రాన్ని నష్ట పరిహారం అడగదల్చుకోలేదన్నారు. కేంద్రం నిబంధనల ప్రకారం మొకజొన్నకు రూ. 3300 మాత్రమే నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కానీ సీఎం కేసీఆర్ కేంద్రం నిబంధనలను పక్కనపెట్టి రైతుల కోసం ఎకరాకు రూ. 10 వేలు ప్రకటించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.