టీడీపీకి దూరంగా ఉంటున్న పరిటాల కుటుంబం… చంద్రబాబుకి ఇబ్బందేనా…?

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఒక పక్క ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆ పార్టీలో కొందరు నేతలు పార్టీకి దూరంగా జరిగే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తలు క్యాడర్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు, పలువురు మాజీ మంత్రులు బిజెపి తీర్ధం పుచ్చుకున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ, దేవినేని అవినాష్ కూడా పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు.

ఇప్పుడు రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న పరిటాల కుటుంబం కూడా గుడ్ బాయ్ చెప్పే అవకాశాలు కనపడుతున్నాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం జేసి కుటుంబంతో వారికి ఉన్న విభేదాలే కారణమని అంటున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా జిల్లాలో అన్నీ తామై వ్యవహరించింది పరిటాల కుటుంబం. అయితే జేసి కుటుంబంతో ఉన్న ఇబ్బందుల కారణంగా మారే ఆలోచనలో ఉన్నారట.

ఇటీవల బిజెపి నేతలతో కూడా పరిటాల శ్రీరాం మాట్లాడారని, రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. జెపి నడ్డా సమక్షంలో సంక్రాంతి తర్వాత బిజెపి తీర్ధం పుచ్చుకునే ఆలోచనలో ఉన్నారని త్వరలోనే పార్టీ మారడం ఖాయమని అంటున్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకి… పరిటాల వర్గం స్వాగతం చెప్పలేదని, వాళ్ళ బలం ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా క్యాడర్ రాలేదని అంటున్నారు. చంద్రబాబు కూడా దీనిపై ఆరా తీసారని… ఆయనకు కూడా పరిటాల వర్గం మారుతుంది అనే కొందరు చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం జిల్లాలో పార్టీకి పెద్ద దెబ్బే.

Read more RELATED
Recommended to you

Latest news