కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారము చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.తొలిరోజే దాదాపు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగతా 264 మంది ఎంపీలు రెండో రోజు ప్రమాణం చేస్తారు. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు నిమిషం పడుతుంది.
ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్.. ఎంపీలతో ప్రమాణం చేయించనున్నారు. తొలుత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేశాక సీనియారిటీ ఆధారంగా మోదీ తరువాత మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, సహాయ మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.తరువాత మిగతా ఎంపీలు రాష్ట్రాల వారీగా అక్షర క్రమంలో ప్రమాణం చేయనున్నారు. మొదట అండమాన్ నికోబార్ తర్వాత ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం చేస్తారు. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీలు, తెలంగాణ ఎంపీలు తొలిరోజే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.