హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి.తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వేలకు వేలు పెట్టి టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణికులు వెళ్తుండగా.. నడిరోడ్డులో ప్రయాణికులను వదిలేసి ట్రావెల్స్ బస్సులు వెళ్తున్నాయి.
ప్రయాణికులు అడిగితే సమాధానం కూడా సరిగా చెప్పడం లేదని తెలుస్తోంది. మీరు ఎక్కడ బుక్ చేసుకున్నారో వాళ్ళని అడగండి అంటూ ట్రావెల్స్ డ్రైవర్లు దబాయిస్తున్నట్లు తెలిసింది. బస్సులకు సరైన పర్మిట్లు లేకపోవడంతోనే సిటీ బయటే ప్రయాణికులను దించేస్తున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఆర్టీవో అధికారులు వెంటనే స్పందించాలని బాధిత ప్యాసింజర్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ప్యాసింజర్ ఆవేదన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
హైదరాబాద్ పరిధిలో ప్రైవేట్ బస్ ట్రావెల్స్ ఆగడాలు..
తిరుపతి నుంచి హైదరాబాద్ కు వేలకు వేలు పెట్టి టికెట్లు బుక్ చేసుకుని వెళుతున్న ప్రయాణికులు…నడిరోడ్డులో ప్రయాణికులను వదిలేసి వెళుతున్న ట్రావెల్స్ బస్సులు.
ప్రయాణికులు అడుగుతున్న సమాధానం చెప్పని సిబ్బంది.
మీరు ఎక్కడ బుక్… pic.twitter.com/C9WXVAuvcM— ChotaNews App (@ChotaNewsApp) February 11, 2025