“గాడ్ ఫాదర్” ప్రమోషన్ కు పవర్ స్టార్ ?

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. ఈ టీజర్‌లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఇది పక్కకు పెడితే.. గాడ్‌ ఫాదర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుందంట.

సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ లో మరో స్టార్ హీరోని ఈవెంట్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా తీసుకురావాలని అభిమానుల నుంచి డిమాండ్ వస్తుంది. గాడ్ ఫాదర్ ఈవెంట్ టు పవర్ స్టార్ వస్తే సినిమాకు మరింత హైపర్ క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను తీసుకురావాలని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు మెగా ఫాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news