అలర్ట్‌.. వచ్చేసింది.. పవన్‌ అన్‌స్టాపబుల్‌ టీజర్‌ వచ్చేసింది

-

ఎప్పుడెప్పుడా అని ఎదురచూస్తున్న బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ పవన్‌ కల్యాణ్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను ఆహా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షో ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ 2కి బూస్టప్ వచ్చింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈ టాక్ షోను ఏ విధంగా ఆసక్తిగా చూశారంటే, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. అయితే ప్రభాస్ ఈ టాక్ షోకు వచ్చిన ఎపిసోడ్‌లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా. ఇక ఇప్పుడు అందరి చూపులు అన్‌స్టాపబుల్ 2లో పవర్‌ఫుల్ ఎపిసోడ్‌పైనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నాడని తెలుసుకుని, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పవర్‌ టీజర్ రాత్రి 8 గంటలకు విడుదల
చేసింది ఆహా.

అయితే.. ఈ టీజర్‌ భీమ్లా నాయక్‌ సాంగ్‌తో స్టార్‌ అయ్యింది. అయితే.. ప్రేక్షక్షకుల స్వాగతంతో సెట్‌లోకి ఎంటరైన పవన్‌కు బాలయ్య తనదైన స్టైల్‌లో ప్రశ్నలు సంధించారు. తనను బాల అని పిలవచ్చంటూ బాలకృష్ణ అంటే.. తరువాత.. నేను ఓడిపోవడానికి సిద్ధం అంటుండగానే.. ఈ రాజకీయాలే వద్దంటూ బాలకృష్ణ చేసిన కామెంట్‌ ఆకర్షణగా మారాయి. అంతేకాకుండా.. పవన్‌ కల్యాణ్‌ను తన అన్న చిరంజీవి గురించి.. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోవడం గురించి పలు ప్రశ్నలు సంధించారు బాలకృష్ణ. లాస్ట్‌లో 10 అంకెలు లెక్కబెట్టి.. మేము బ్యాండ్‌ బాయ్స్‌ అంటూ టీజర్‌ ముగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version