ఆ ఆలోచననే నన్ను రాజకీయాల వైపు నడిపించింది : పవన్‌

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విశాఖ నేతలు, వారి కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ప్రజలందరినీ నా వాళ్లే అనుకుంటాను అని వెల్లడించారు. సమూహంగా ఉండే సమాజంలో కేవలం తన ఒక్కడి వల్లే అద్భుతాలు జరిగిపోతాయంటే నమ్మబోనని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. “నా పిల్లలకు నేను మంచి విద్య ఇవ్వగలను, డబ్బులు ఇవ్వగలను, మంచి ఇల్లు, దుస్తులు, ఇతర సౌకర్యాలు ఇవ్వగలను. కానీ వారు బతికేందుకు మంచి సమాజం తీసుకురావాలంటే నేనేం చేయాలన్న ఆలోచనే నన్ను రాజకీయాల వైపు నడిపించింది” అని వెల్లడించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan Postpones Bus Yatra Indefinitely

మంచి ఆలోచనలతో కూడిన బలమైన సమూహాన్ని తయారుచేసేందుకు జనసేన పార్టీని ఓ వేదికగా నిర్మించినట్టు పవన్ కల్యాణ్ వివరించారు. నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు… చట్టం ఒకరికే ఎందుకు బలంగా పనిచేస్తుంది అన్న ఆలోచనల నుంచి పుట్టిన తన పయనం ఇవాళ ఒక బలమైన ఆలోచనల సమూహాన్ని తయారుచేసిందని పవన్ కల్యాణ్ తెలిపారు. కాగా, ఎన్నికల అనంతరం తాను పార్టీ ఆఫీసులో కూర్చున్న సమయంలో ఓ మహిళ వచ్చి కలిసిందని పవన్ వెల్లడించారు. “తన 14 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని ఆమె తెలిపింది. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని చెబుతూ, అత్యాచార ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను నాతో పంచుకుంది. అది నన్ను మరింత కదిలించివేసింది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన బిడ్డకు తగిన రక్షణ లేనప్పుడు, మనం ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చే కోపం మాటల్లో చెప్పలేనిది. ఈ వ్యవస్థల పరిస్థితి చూసి ఎన్నిసార్లు నాలో నేను దహించుకుపోయానో నాకు తెలుసు. పోరాటమే మార్గం అని భావించాను” అని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news