‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా’ ఈ డైలాగ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘గబ్బర్ సింగ్’లోనిది. ఈ డైలాగ్ పవన్ కల్యాణ్ కు కంప్లీట్ గా సెట్ అవుతుందని మరో సారి ప్రూవ్ అయింది. ‘జల్సా’ సినిమా రీ-రిలీజ్ లోనూ రికార్డు వసూళ్లు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (సెప్టెంబర్ 2) సందర్భంగా పలు థియేటర్లలో ఆయన నటించిన ‘జల్సా’, ‘తమ్ముడు’ చిత్రాలను ప్రదర్శించారు. కాగా, ఎక్కువ థియేటర్లలో ‘జల్సా’ ఫిల్మ్ రిలీజ్ చేయగా, ఆ సినిమా రీ-రిలీజ్ లోనూ రికార్డు వసూళ్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ను సెప్టెంబర్ 1న 702 షోలు వేసినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన ఒకే ఒక రోజులో ఈ మూవీకి రూ.3.20 కోట్లు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అలా రీ-రిలీజ్ లో ఒక సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఇదే తొలి సారి అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.
రీ-రిలీజ్ లోనూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారని ఈ సందర్భంగా అభిమానులు అంటున్నారు. పవర్ స్టార్ అశేష అభిమానులు ఆయన బర్త్ డే సందర్భంగా ‘జల్సా’ మూవీని చూసి ఆనందపడిపోయారు. ఇటీవల మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘పోకిరి’ మూవీ రీ-రిలీజ్ చేశారు. అది రూ.1.74 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా, అంతకు మించిన కలెక్షన్స్ ను పవన్ కల్యాణ్ చిత్రం చేసింది.
మొత్తంగా చిత్ర సీమలో రీ-రిలీజ్ అనేది కూడా అనివార్యంగా మారింది. ఒక ట్రెండ్ లాగా సాగనుంది. త్వరలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ‘బిల్లా’ పిక్చర్ ను విడుద ల చేయనున్నారు.
అలా ఇక సినీ హీరోల బర్త్ డే సందర్భంగా వారి సూపర్ హిట్ ఫిల్మ్స్ ను మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రజెంట్ పాలిటిక్స్ తో పాటు ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ నుంచి ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.