జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. తన వారాహి ద్వారా ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. ఇందు కోసం ఇప్పటికే తన ప్రచార రధం తో కదలి వచ్చేందుకు తొలి అడుగు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి గురించి ప్రకటన చేసిన సమయం నుంచి పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దీనికి పవన్ సీరియస్ గా స్పందించారు. తాను వారాహితోనే ఏపీలోని ప్రతీ ప్రాంతానికి వస్తానని ప్రకటించారు. ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే తానేంటో చూస్తారంటూ హెచ్చరించారు. టీడీపీతో జనసేన పొత్తు ఖారరైందంటూ ప్రచారం సాగుతున్న వేళ పవన్ కల్యాణ్ వారాహి ద్వారా యాత్ర మరింతగా రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.
అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 24న తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్ వారాహి వెహికల్కు ప్రత్యేక పూజలు జరుపుతారు. అనంతరం తెలంగాణ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ అనుసరించే వ్యూహంపై దిశానిర్ధేశం చేయనున్నారు. కాగా వివాదస్పదమైన వారాహి వాహనంతో ఏపీలో రోడ్ షోలు నిర్వహించేందుకు పవన్ సన్నద్ధం
అవుతున్నారు.