పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన సినిమాలు ‘జల్సా’, ‘తమ్ముడు’ రీ-రిలీజ్ చేశారు. పలు థియేటర్లలో ఆ సినిమాలు చూసి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ ఫస్ట్ గ్లింప్స్ చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు.
పవర్ స్టార్ ‘హరి హర వీరమల్లు’ తో పాటు ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీ శ్ శంకర్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ పిక్చర్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్..తథా వ్యవహారమ్’ ఫిల్మ్ కూడా చేయనున్నారు. కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు తెలుగు చిత్రసీమకు పరిచయం చేసిన దర్శకులెవరో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ప్లస్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు దర్శకుడిగా పవన్ కల్యాణ్ ‘బద్రి’ పిక్చర్ తో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ .. వరుస సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయారు.
పవన్ కెరీర్ లోనే సూపర్ హిట్ ఫిల్మ్ ‘తొలి ప్రేమ’ చిత్రం ద్వారా కూడా ఏ.కరుణాకరన్ దర్శకుడిగా పరిచయం చేశారు పవన్ కల్యాణ్.
ఇతర భాషల దర్శకులను తన చిత్రాల ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు పవన్ కల్యాణ్. ‘ఖుషి’ సినిమా ద్వారా ఎస్.జే.సూర్య, ‘బంగారం’ సినిమా ద్వారా ధరణి, ‘పంజా’ సినిమా ద్వారా విష్ణు వర్ధన్ వంటి తమిళ దర్శకులు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి కూడా పవన్ మొగ్గు చూపుతుంటారు.
‘వకీల్ సాబ్’ ద్వారా వేణు శ్రీరామ్ కు, ‘భీమ్లా నాయక్’ ద్వారా సాగర్.కె. చంద్రకు తనను డైరెక్ట్ చేసే అవకాశం పవన్ కల్యాణ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘భవదీయుడు భగత్ సింగ్’, ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ మూవీస్ చేయనున్నారు.