రేపు సభాముఖంగా అందరికీ, అన్నిటికీ సమాధానం చెబుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. జన సైనికుల తో పాటు ఏపీ ప్రజలు సభకు రావాలని పిలుపునిచ్చారు పవన్. ఇక సభ నిర్వహణపై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణం లో జరుగుతుంది.. దామోదరం సంజీవయ్య పేరు తో సభ ప్రాంగణం నిర్వహణ ఉంటుందని చెప్పారు.
పవన్ కళ్యాణ్ నాయకత్వం లో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక దిశ నిర్దేశ సభ జరుగుతుంది..ప్రజా సమస్యల కోసం పోరాడే పార్టీ జనసెనదన్నారు. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అధికారులు చేయొద్దు..సీఎం అహంకారానికి ప్రజల ఆత్మాభిమానం కి మధ్య జరుగుతున్న పోరాటం ఈ సభ అని వెల్లడించారు. పోలీస్ లు పెట్టే ఆంక్షల కు భేదిరేది లేదు…వారది పై వైసిపి ఫ్లెక్సీ లు పెట్టుకోవచ్చు , జన సేన వి పెట్టకూడదు అని పోలీస్ లు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఫైర్ అయ్యారు.
ఈ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర లోనే ఉన్నాయని.. ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. జనసేన భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల కు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు…ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గం లకు సభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సభ కు వచ్చే ప్రజలకు, జన సైనికులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.