అన్ని కోట్లు పెట్టి ఫార్మ్ హౌస్ నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్.. కారణం..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తుతం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతూనే.. మరోక వైపు జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే బాటలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. అంతేకాదు గత నాలుగు నెలల క్రితం ఏకంగా 8 స్కార్పియో కార్లను కూడా కొనుగోలు చేసి ప్రచారానికి ఉపయోగిస్తున్నారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక ఈ క్రమంలోని ఆయన ఏకంగా 160 కోట్ల రూపాయల ఖర్చు చేసి ఒక ఫార్మ్ హౌస్ నిర్మిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఖాళీగా ఉంటే చాలు ఫార్మ్ హౌస్కే పరిమితం అవుతూ ఉంటారు. ప్రశాంత వాతావరణంలో పశువుల పోషణ చూసుకోవడం, వ్యవసాయం చేయడం ఆయనకు ఇష్టమైన పని. ఇక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన తన ఫారం హౌసులో నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన ఫార్మహౌస్లో పండిన ఆర్గానిక్ పండ్లను తనకు ఇష్టమైన వారికి పంపడం పవన్ కి ఉన్న ఒక ప్రత్యేకమైన అలవాటు అని చెప్పవచ్చు. ఇకపోతే హైదరాబాదు నగరు శివారులలో గండిపేట – చిలుకూరు మధ్య విస్తరించి ఉన్న 16 ఎకరాల ల్యాండ్ ను ఆయన గతంలో కొనుగోలు చేశారు. అక్కడ ఫార్మ్ హౌస్ నిర్మించారు. ముఖ్యంగా సినిమా షూటింగ్స్, రాజకీయ కార్యక్రమాలు లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఎక్కువగా గడుపుతారు. ముఖ్యంగా మొక్కలకు నీళ్లు , ఎరువులు, ఆవులకు మేత లాంటివి చూసుకుంటూ ఉంటాడు.

అయితే ప్రస్తుతం ఇది చిన్నది కావడంతో దానిని కూల్చేసి భారీగా కొత్త ఫార్మ్ హౌసు నిర్మించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు భారీగా అత్యధిక సౌకర్యాలతో కూడిన కొత్త ఇంటి నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ ఉన్న ఏరియాలో ఎకరం 10 కోట్ల మార్కెట్ వాల్యూ కలిగి ఉండటం అంటే పవన్ గండిపేట లో ఉన్న ఫామ్హౌస్ ల్యాండ్ ధర అక్షరాల 160 కోట్ల రూపాయలని చెప్పవచ్చు. ఆయన తన కాలక్షేపం కోసం ఇలా కోట్లు ఖర్చు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news