కామెన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. వెయిట్‌ లిఫ్టర్ల పరంపర

-

కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజు నుంచే అదరగొడుతున్న భారత అథ్లెట్లు నిన్న పతకాల వేట ప్రారంభించారు. పురుషుల విభాగంలో ఒక రజతం, ఒక కాంస్యం రాగా, మణిపూర్ వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను ఏకంగా పసిడి పతకాన్ని అందించింది. 49 కేజీల విభాగంలో డిఫెండింగ్ క్వీన్‌గా బరిలోకి దిగిన మీరాబాయి కామన్వెల్త్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. 49 కేజీల విభాగంలో రికార్డు స్థాయిలో 201 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాధించింది. స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 84 కేజీలు ఎత్తిన చాను.. రెండో ప్రయత్నంలో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు మొత్తం 201 కేజీలతో చాంపియన్‌గా అవతరించింది. ఫలితంగా వ్యక్తిగత జాతీయ రికార్డును సమం చేసింది. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో చాను రజత పతకం గెలుచుకుంది.

Bindyarani Devi clinches India's second silver, fourth medal at Birmingham  | Commonwealth Games | Sports | Onmanorama

అయితే తాజగా.. రెండో రోజు నాలుగు పతకాలతో ముగించింది. నిన్న తొలుత సంకేత్ సర్గర్ రజత పతకం సాధించి భారత్‌కు తొలి పతకం అందించగా, ఆ తర్వాత గురురాజ్ పుజారి కాంస్య పతకం అందుకున్నాడు. అనంతరం మణిపూర్‌కు చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను స్వర్ణంతో మెరిసింది. చివర్లో 23 ఏళ్ల బింద్యారాణి రజత పతకం గెలుకుని భారత్ ఖాతాలో నాలుగో పతకాన్ని చేర్చింది. 55 కేజీల విభాగంలో పోటీపడిన బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 కేజీలతో మొత్తంగా 202 కేజీలు ఎత్తి రజత పతకం సాధించింది. నైజీరియాకు చెందిన అదిజాత్ ఒలారినోయ్ పసిడి పతకం కొల్లగొట్టింది. బింద్యారాణి కంటే ఒక్క కేజీ ఎక్కువగా 203 కేజీలు ఎత్తిన అదిజాత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు కాంస్యం దక్కింది.

 

Read more RELATED
Recommended to you

Latest news