పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ను అలా చూసి షాక్ అయ్యా.. అంటున్న ప్రముఖ నటి..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. రేణూ దేశాయ్ విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్న విషయం తెలిసిందే. నిజానికి పవన్ కళ్యాణ్ నందిని రెడ్డిని పెళ్లి చేసుకున్న కొంతకాలానికి రేణూ దేశాయ్ తో సహజీవనం చేశాడు. ఇక అకీరానందన్ జన్మించిన తర్వాత నందిని రెడ్డికి విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్ ను వివాహం చేసుకున్నాడు. ఇక తర్వాత వీరికి ఆధ్యా జన్మించిన తర్వాత పూర్తిగా రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చి దూరమైపోయాడని చెప్పవచ్చు. ఇకపోతే వీరిద్దరిపై ప్రముఖ సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇందు షాకింగ్ కామెంట్స్ చేశారు.

అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఇందు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఇందు మాట్లాడుతూ చిన్న వయసులోనే భర్త చనిపోయారని ఇక అప్పటినుంచి సింగిల్ పేరెంట్ గానే పిల్లల్ని పోషిస్తున్నానని ఆమె తెలిపింది. ఇక సింగిల్ మదర్ గా ఉండడం అంటే ప్రతిరోజు చాలెంజ్ తో కూడుకున్న పని.. ఇక ప్రతిరోజు తానే కుకింగ్ చేస్తాను అని ఇందు తెలిపింది. ఆమె మాట్లాడుతూ నా స్నేహితురాలు రేఖ ఒక బ్యూటీ పార్లర్ ప్రారంభించినప్పుడు తను నా హెయిర్ స్టైల్ చేసింది. ఇక ఆ ఫోటో ఇప్పటికీ కూడా నా షాప్ లో ఉంటుంది అని ఇందు తెలిపారు. ముఖ్యంగా బొంబాయి ప్రియుడు సినిమాతో తన సినీ కెరియర్ మొదలైందని తెలిపిన ఆమె ఆ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాం అని కూడా తెలిపింది.

ఇక బొంబాయి ప్రియుడు సినిమా షూటింగ్ సమయంలో తనకు తెలుగు సరిగ్గా రాదు అని, డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించిందని ఇందు వెల్లడించింది. ఇకపోతే బద్రి సినిమాలో రేణు దేశాయ్ ను నేను కొడతాను . ఇక ఆ సినిమా ఇప్పుడు చూసుకుంటే నేను కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానని అనిపిస్తుంది . ఇక మొదటిసారి పవన్ కళ్యాణ్ తో నేను ఒక యాడ్ చేశాను. టాటా సెల్యులార్ యాడ్ లో నేను పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని ఆమె తెలిపింది. ఇక అంతేకాదు ఖుషి సినిమాలో నేను డాక్టర్ పాత్ర పోషించాను. అయితే ఈ షూటింగ్ చేస్తున్న సమయంలో పవన్ రేణు దేశాయ్ అక్కడ ఉన్నారు. ఇక నేను వాళ్ళిద్దరిని చూసి షాక్ అయి ఇక్కడ మీరు ఎందుకు ఉన్నారు అని అడిగితే వి ఆర్ స్టేయింగ్ టుగెదర్ (సహజీవనం) అని వాళ్ళు నాతో చెప్పారు. అంటూ ఇందు తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version