Big Breaking : పవన్ కల్యాణ్ ‘వారాహి’ రిజిస్ట్రేషన్ వాయిదా.. ఎందుకంటే..?

-

‘వారాహి’ఈజ్‌ రెడీ ఫర్‌ బ్యాటిల్‌ అని ఎప్పుడైతే సోషల్‌ మీడియాతో ఫోటోలు పెట్టారో పవన్‌ కల్యాణ్.. అప్పటి నుంచి ఆయన బస్‌ యాత్ర వాహనం చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. అయితే.. తాజాగా.. ఆర్మీ కలర్‌లో ఉన్న వారాహి వెహికల్ రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. లారీ చాసిస్ ను బస్సుగా మార్చడం, వాహనం ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువ ఉండటం, మైన్స్లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం రూల్స్కు విరుద్ధమంటూ తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం సూచించింది. అంతేగాక ఆర్మీకి సంబంధించిన కలర్ను ఒక సివిల్ వాహనానికి ఉపయోగించకూడదని పేర్కొంది.

Jana Sena Party president Pawan Kalyan unveils his campaign vehicle 'Varahi'  - The Hindu

ఇవన్నీ మార్చుకుని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయగలం అని ఆఫీసర్లు చెప్పడంతో పవన్ కల్యాణ్ ఆర్మీ కలర్ వాహనం రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉంది. కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేసేందుకు వారాహి వాహనాన్ని రెడీ చేశారు. వారాహి వాహనంతో దిగిన ఫొటోను ఆయన ఇటీవల ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇది క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాహనానికి ఉన్న కలర్పై పవన్ టార్గెట్గా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారాహి రిజిస్ట్రేషన్ వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news