ఓ వైపు సినిమాలు…మరోవైపు రాజకీయాలు చేస్తూ పవన్ కల్యాణ్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే…అయితే రాజకీయాలు చేస్తూ…సినిమాలు చేయడం పెద్దగా ఇబ్బంది ఉండదు…కానీ సినిమాలు చేస్తూ…రాజకీయం చేయడం అనేది కష్టమైన పని…సినిమాల్లో సక్సెస్ అవ్వొచ్చు గాని…రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని…ఏదో సినిమాలు చేస్తూ…అప్పుడప్పుడు రాజకీయాలు చేయడం వల్ల పావలా ప్రయోజనం ఉండదు…అసలు రాజకీయాల్లో ఎప్పుడు యాక్టివ్ గానే ఉండాలి…అలా కాకుండా ఏదో పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తే ఎవరికి ఉపయోగం ఉండదు.
పవన్ ఇప్పటివరకు అలా చేయడం వల్లే ఏపీలో జనసేన పార్టీ పికప్ అవ్వలేదని చెప్పొచ్చు…అసలు 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఘోరంగా ఓడిపోయాయి..అయితే ఆ తర్వాత నుంచి అధికార వైసీపీపై యుద్ధం చేస్తూ…ప్రజల్లో బలం పెంచుకునే ఛాన్స్…అటు టీడీపీకి ఉంది…ఇటు జనసేనకు ఉంది…కానీ ఆ ఛాన్స్ పూర్తిగా ఉపయోగించుకుంది టీడీపీ మాత్రమే…వైసీపీపై ఫైట్ చేస్తూ…ఈ మూడేళ్లలో ప్రజల్లో మళ్ళీ బలం పెంచుకుంది…ఇప్పుడు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. అంటే టీడీపీ అధినేత చంద్రబాబు గాని, టీడీపీ నేతలు గాని పూర్తిగా ప్రజల్లో ఉంటూ…వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారు…దాని వల్ల ఈ మూడేళ్లలో టీడీపీ చాలావరకు పుంజుకుంది.
కానీ పవన్ అలా చేయలేదు…ఎప్పటి లాగానే అప్పుడప్పుడు రాజకీయం చేశారు…పవన్ జనంలోకి రాకపోవడం వల్ల…ఆ పార్టీ నేతలు కూడా జనంలో ఎక్కువ తిరగలేదు…ఫలితంగా ఇప్పటికీ జనసేన బలపడలేదు…అయితే ఈ మధ్య కాస్త దూకుడుగా ఉంటున్నారు. దీంతో జనసేన బలం కాస్త పెరిగింది…అది కూడా ఓ 10 సీట్లు వరకు గెలుచుకునే కెపాసిటీ…ఈ కెపాసిటీతో జనసేన సక్సెస్ అవ్వడం కష్టం. పైగా బలం లేకపోయినా…పొత్తు ఉంటే పవన్ ని seem అభ్యర్ధిగా ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నారు. అసలు బలం లేకుండా సీఎం సీటు ఎలా ఇస్తారనేది తెలియడం లేదు.
అందుకే టీడీపీ సైతం పొత్తు గురించి పెద్దగా మాట్లాడటం లేదు…సోలో గానే ముందుకు పోవాలని చూస్తుంది…అయితే త్వరలోనే పవన్ ప్రజల్లో తిరగనున్నారు..ఇక అక్కడ నుంచైనా జనసేన బలం పెంచుతారేమో చూడాలి. ఎన్నికల నాటికి జనసేన..సింగిల్ గా 50 సీట్లు గెలుచుకునే బలం అయిన పెంచుకుంటుందో లేదో చూడాలి. మొత్తానికైతే ఇక పవన్…ఫుల్ టైమ్ ప్రజల్లో ఉండేలా ఉన్నారు.