రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? – పవన్

-

 

రుషికొండ తవ్వకాలపై జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్‌ సెటైరికల్ ట్వీట్ చేశారు. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అంటూ మండిపడ్డారు. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అన్నారు.

రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని వివరించారు. వైసిపి ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అని నిలదీశారు జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్‌.

ఇది ఇలా ఉండగా.. నాకు శ్రీ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఎంత గొప్ప మాటలు… ఇంత మంచి మాటలు శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు? రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా.. ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు. శ్రీ అంబేద్కర్ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నానని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version