సజ్జల..ఓ డిఫ్యాక్టో సీఎం – పవన్ సీరియస్ కామెంట్లు

-

సజ్జల..ఓ డిఫ్యాక్టో సీఎం అంటూ పవన్ కళ్యాణ్‌ సీరియస్ కామెంట్లు చేశారు. బీజేపీతో సంబంధం లేకుండానే వైసీపీని కొడతానన్న పవన్… 2024లో తమను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరికి సమాధానం చెబుతానన్నాడు. డిఫ్యాక్టో సీఎం అంటూ సజ్జలపై మండిపడ్డారు.

సజ్జలే ఇప్పటం ఇళ్ల కూల్చివేతల వెనుక ఉన్నారంటూ ఫైర్‌ అయ్యారు పవన్‌ కళ్యాణ్‌. వైసీపీని కొట్టాలంటే బీజేపీకి చెబుతానా అంటూ పవన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆరుతో జగన్ పోల్చుకోవద్దని.. వైఎస్సార్ గాంధీ, అంబేద్కర్ కంటే గొప్ప వ్యక్తి కాదని చురకలు అంటించారు.

జగన్ ఉత్తముడేం కాదు.. జగన్ ఉత్తముజడైతే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామని.. 2024 ఎన్నికలు చాలా కీలకమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతివ్వండని.. నన్ను చూసి ఓటేయొద్దు.. గత 15 ఏళ్లుగా నేనేం చేశాను.. మా విధానాలను చూసి ఓటేయండని కోరారు. ఈ సారి ఆచితూచి అడుగులేస్తూ వ్యూహాలు ఉంటాయి.. మద్దతివ్వండి…మమ్మల్ని బెదిరించే వారు ఎవ్వరైనా సరే ఎల్లవేళలా అధికారంలో ఉండరు.2024 ఎన్నికలు తర్వాత పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్లకు సమాధానం చెబుతానని వార్నింగ్‌ ఇచ్చారు పవన్ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news