కులాన్ని అడ్డుపెట్టుకుని చిరంజీవి, పవన్‌ పార్టీలు పెట్టారు – పెద్దిరెడ్డి

-

కులాన్ని అడ్డుపెట్టుకుని చిరంజీవి, పవన్‌ పార్టీలు పెట్టారని.. పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాన్ని అడ్డుపెట్టుకుని ఎవరు వచ్చినా ప్రజలంతా జగన్ వైపే ఉంటారని.. రాజకీయంగా వారికి ఎలాంటి లబ్ది చేకూరే అవకాశం లేదని విమర్శించారు. చిత్తూరు అంబేద్కర్ భవన్ లో వైఎస్సార్ కాపు నేస్తాం కార్యక్రమంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఇప్పటికే రాష్ట్రంలో మూడు విడుతలుగా కాపు నేస్తం అందించామని… మన ప్రభుత్వంలో కాపులకు, బలిజలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. వీటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మందికి అనేక పదవులు ఇస్తున్నామని తెలిపారు. గతంలో చిరంజీవి పార్టీ పేట్టి రాజకీయాల్లోకి వచ్చారు.. ఈ రోజు పవన కళ్యాణ్ జన సేన పార్టీ పెట్టీ… గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు. పేదలకు సిఎం జగన్ అండగా నిలబడుతున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news