కాంగ్రెస్ ఎంపీ: ఎవరు గెలవాలో చెప్పాల్సింది ప్రజలు.. సినిమా హీరోలు కాదు !

-

కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగిన రెండు రోజులకు అంటే ఏప్రిల్ 12న ఫలితాలను ప్రకటించనున్నారు. దీనితో కాంగ్రెస్ , బీజేపీ, జేడీఎస్ , ఆప్ మరియు ఇతర స్థానిక పార్టీలు ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఇక ఈ రోజు ఉదయం కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలోకి వెళుతున్నానని మరియు సీఎం బసవరాజ్ బొమ్మై కి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం పాల్గొంటానని తెలిపిన విషయం తెలిసిందే.

ఈ అంశంపై కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ , కర్ణాటకలో ఏ పార్టీ గెలవాలి ? ఎవరి అధికారంలోకి రావాలి అన్నది నిర్ణయించేది సినిమా స్టార్ లు కాదు.. ప్రజలు అని ఈయన తెలిపారు. ప్రజలు బీజేపీ ప్రజాప్రతినిధుల మాటలను పట్టించుకోకపోవడంతో ఇక బీజేపీ సినీ తారల సహాయాన్ని ఈ విధంగా తీసుకుంటోందని కామెంట్ చేశారు. మరి ఈ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ గెలిచి అధికారాన్ని నిలుపుకుంటుందా లేదా కాంగ్రెస్ సాధిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version