చంద్రబాబు కంటతడి ఎపిసోడ్ నేపథ్యంలో…. వైసీపీ పార్టీపై తెలుగు దేశం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు. అయితే… బాలకృష్ణ కు కౌంటర్ గా ఏపీ మంత్రి పేర్ని నాని… ప్రెస్ మీట్ నిర్వహించి… చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అసలు అసెంబ్లీ లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై ఎలాంటి వ్యాఖ్యలు.. వైసీపీ నాయకులు చేయలేదన్నారు.
కుటుంబ పరువును పణంగా పెట్టి నారా చంద్రబాబు మెలో డ్రామా క్రియేట్ చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు సతీమణిని ఎవరేమన్నారు? ఇవతల ఉన్నవాళ్లు సంస్కారం లేనివాళ్లు అనుకుంటున్నారా మీరు? అంటూ నిలదీవారు పేర్ని నాని. ఎన్టీఆర్ ను ఏకాకి చేసింది నారా చంద్రబాబు నాయుడు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు తప్పుడు మాటలు చెప్పి… ఆయనను ఒంటరి చేశాడని ఆగ్రహించారు పేర్ని నాని. చంద్రబాబు సతీమనిని అన్నట్లు… ఎలాంటి ఆధారం ఉన్న బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆమె పై పల్లెత్తు మాట అనలేదన్నారు పేర్నినాని.